Saturday, 24 December 2011

రామ్ చరణ్‌ని అడ్డంపెట్టుకునే రామ్‌కి ట్విస్ట్





రామ్ చరణ్ ఉన్నాడనే ధైర్యంతోనే రామ్ కు డేట్స్ ఇవ్వటంలో తమన్నా ఇబ్బంది పెడుతోందని ఫిల్మ్ నగర్ టాక్. రామ్ చరణ్ సరసన రచ్చ చిత్రంలో చేస్తున్న ఆమె రామ్ సరసన ఎందుకంటే ప్రేమంట చిత్రంలోనూ చేస్తోంది. అయితే ఆమె సరిగా డేట్స్ ఇవ్వటం లేదని, ఇబ్బంది పెడుతోందని చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్ ఫిల్మ్ ఛాంబర్ కి కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు చేసారు. ఈ నేపథ్యంలో నిర్మాత కె.ఎల్ నారాయణ అధ్యక్ష్యతన జరిగిన ఈ మీటింగ్ లో ఆమె డేట్స్ ఎడ్జెస్ట్ ను బట్టి ఆమెతో చేస్తున్న ముగ్గురు నిర్మాతలు ప్లాన్ చేసుకోవాలని తీర్మానం చేసారు.

తమన్నా ప్రస్తుతం రచ్చ, ప్రభాస్ సినిమా రెబెల్ చేస్తోంది. రవికిషోర్ వంటి పెద్ద నిర్మాతను ఇబ్బంది పెడుతోందంటే దానికి కారణం రామ్ చరణ్ ఉన్నాడనే ధైర్యంతోనే అంటున్నారు. 'కందిరీగ' తర్వాత హీరోగా రాం నటిస్తున్న సినిమా 'ఎందుకంటే.. ప్రేమంట!'. రాం సరసన తొలిసారిగా తమన్నా నటిస్తున్న ఈ సినిమాకి ఎ. కరుణాకరన్ డైరెక్టర్.

సుమన్, రఘుబాబు, రిషి, సాయాజీ షిండే, నాగినీడు, సత్యకృష్ణన్, మేల్కోటే, సుమన్‌శెట్టి, జెమిని విజయ్ తారాగణమైన ఈ సినిమాకి మాటలు: కోన వెంకట్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, సంగీతం: జి.వి. ప్రకాశ్‌కుమార్, సినిమాటోగ్రఫీ: ఐ. ఆండ్రూ, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: ఎ.ఎస్. ప్రకాశ్, స్టంట్స్: పీటర్ హెయిన్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ. కరుణాకరన్.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...